నామినేషన్లకు రేపే లాస్ట్.. ఇంకా తేలని అభ్యర్థులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. దీంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు నమోదయ్యే అవకాశం ఉంది.
By అంజి Published on 9 Nov 2023 9:25 AM ISTనామినేషన్లకు రేపే లాస్ట్.. ఇంకా తేలని అభ్యర్థులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. దీంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నెల 3వ తేదీతో ప్రారంభమైన నామినేషన్ల పర్వం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పూర్తవుతుంది. ఇవాళ ఏకాదశి కూడా కావడంతో అంతా మంచి రోజని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర్య అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్ల దాఖలుకు రెడీ అయ్యారు. తిథుల రీత్యా ఇవాళ, రేపు మంచి రోజులుగా భావిస్తుండటంతో ఎక్కువ నామినేషన్లు దాఖలు అయ్యే ఛాన్స్ ఉంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు రెండు స్థానాల్లో నామినేషన్లు వేయనుననారు. ఉదయం పదకొండు గంటలకు గజ్వేల్ లో ఆయన నామినేషన్ వేస్తారు. తర్వాత ఆయన అక్కడి నుంచి కామారెడ్డికి వెళ్లి అక్కడ కూడా నామినేష్ వేస్తారు. నామినేషన్లు వేయని ఆయా పార్టీల అభ్యర్థులు.. ఇవాళ లేదా రేపు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే బీజేపీ 11, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్, సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్ సీట్లను పెండింగ్‌లో పెట్టింది. అక్కడ అభ్యర్థులు ఎవరో ఇంకా సస్పెన్షన్‌లోనే ఉంది. మరోవైపు బీఆర్‌ఎస్ 119 స్థానాల్లో అభ్యర్థులకు బీఫామ్స్ అందించింది. అభ్యర్థులను ప్రకటించని నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారి గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టికెట్లను ఆశిస్తున్న వారు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పరిస్థితి. నమ్ముకున్న కేడర్‌కు టికెట్ తనకే అంటూ బయటకు గంభీరంగా చెబుతున్నా చివరి నిమిషయంలో ఏం జరుగుతుందోనని ఆశావహులు టెన్షన్ పడుతున్నారు.