గజ్వేల్‌లో కేసీఆర్ ముందంజ.. కామారెడ్డిలో మూడోస్థానం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  3 Dec 2023 10:47 AM IST
telangana, election, counting, kcr, kamareddy, gajwel,

గజ్వేల్‌లో కేసీఆర్ ముందంజ.. కామారెడ్డిలో మూడోస్థానం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద నాయకులు సైతం ఆయా చోట్ల వెనుకంజలో ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్‌ అధినేత , సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేశారు. గజ్వేల్‌లో ఆయన ముందంజలో కొనసాగుతున్నారు. అయితే.. ఆయన ప్రభావం కూడా ఎక్కువగా కనిపించడం లేదని అంటున్నారు. కేసీఆర్ స్వల్ప మెజారిటీతోనే ఉన్నారని తెలుస్తోంది. 920 ఓట్ల మెజార్టీతో గజ్వేల్‌లో ముందంజలో ఉన్నారు సీఎం కేసీఆర్.

మరోవైపు కామారెడ్డిలో కేసీఆర్‌కు ప్రజలు షాక్‌ ఇచ్చారు. అక్కడ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌పై బరిలోకి దిగారు. అయితే.. అక్కడ ఇప్పటి వరకు రేవంత్‌రెడ్డే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయడంతో తమ పార్టీ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ భావించింది. కానీ.. ఇప్పటి వరకు పూర్తయి ఏ రౌండ్‌లో కూడా కేసీఆర్ హవా కనిపించలేదు. అన్నింట్లో రేవంత్‌రెడ్డినే ముందంజలో కొనసాగుతున్నారు. మరోవైపు కేసీఆర్ కామారెడ్డిలో మూడో రౌండ్‌లోమూడోస్థానంలో స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది.

ఎన్నికల కౌంటింగ్‌కు ముందు ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ హవా ఉంటుందని అంచనా వేశాయి. ఇప్పుడు అవే దాదాపుగా నిజం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే.. కాంగ్రెస్‌ మేజిక్‌ ఫిగర్‌ దాటి 63 స్థానల్లోఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 43 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 60 స్థానాల్లో గెలవాల్సి ఉండగా.. కాంగ్రెస్‌ ఇప్పటికే ఆ మేజిక్‌ ఫిగర్‌ను దాటింది. ఇప్పటి వరకు అయితే.. కొన్ని రౌండ్స్‌ మాత్రమే పూర్తయ్యాయి. మరి పూర్తిగా రౌండ్స్‌ అయ్యేసరికి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Next Story