నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ, అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణలో పలు ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించనున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 9 May 2024 9:45 AM IST

telangana, election campaign, rahul gandhi, amit shah,

నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ, అమిత్ షా

మే 13న నాలుగో దశ పోలింగ్‌కు ముందు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణలో పలు ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించనున్నారు. నేడు రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నారు. నర్సాపూర్, సరూర్ నగర్ ఎన్నికల ప్రచార సభలకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ జన జాతర సభలో రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్న జన జాతర సభలో రాహుల్, రేవంత్ కలిసి పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ పార్లమెంట్ స్థానాలలో కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లు సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉంది.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేడు తెలంగాణకు రానున్నారు. భువనగిరి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు భువనగరిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొంటారు. మే 11న వికారాబాద్‌, వనపర్తిల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొంటారు.

Next Story