వేసవి సెలవులపై తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది

By Knakam Karthik
Published on : 10 April 2025 10:13 AM IST

Telangana, Summer Holidays, Education Department, Students

వేసవి సెలవులపై తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొంది. విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించింది. కాగా వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ ప్రకటన జారీ చేసింది.

ఏప్రిల్ 23 లోపు పరీక్షలు పూర్తవ్వనున్న నేపథ్యంలో అదే రోజు పరీక్షా ఫలితాలు వెల్లడించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 24 నుంచే వేసవి సెలవులు ప్రకటించింది. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రానున్న మూడు రోజుల్లో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ అలాగే సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

Next Story