ఆ టెండర్ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By -  Medi Samrat
Published on : 18 Jan 2026 6:58 PM IST

ఆ టెండర్ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంచలన నిర్ణయం తీసుకున్నారు. నైనీ కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్‌ను రద్దు చేయాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) యాజమాన్యాన్ని ఆదేశించారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే కొత్తగా టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్ ప్రక్రియలో తన పాత్ర ఉందంటూ ఒక తెలుగు టీవీ ఛానెల్, పత్రికలో వచ్చిన కథనాలను భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి కట్టుకథలు ప్రచురించారని ఆరోపించారు. ఇంకా ఎవరూ పాల్గొనని టెండర్ విషయంలో తమను ఎలా నిందిస్తారని కంపెనీ యాజమాన్యం తన దృష్టికి తెచ్చిందని వివరించారు. ఒడిశాలోని నైనీ బొగ్గు గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ దాదాపు దశాబ్దం క్రితం సింగరేణికి కేటాయించింది. గతేడాది ఏప్రిల్‌లో ఈ గనిలో బొగ్గు ఉత్పత్తిని భట్టి విక్రమార్క ప్రారంభించారు.


Next Story