'2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం'.. డిప్యూటీ సీఎం భట్టి హామీ

రాష్ట్రంలో ఇప్పటికే 50,000 పోస్టులను భర్తి చేశామని, యువతకు 2 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.

By అంజి  Published on  8 Nov 2024 9:52 AM IST
Telangana, Dy CM Bhatti, jobs, Telangana Govt

'2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం'.. డిప్యూటీ సీఎం భట్టి హామీ

హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే 50,000 పోస్టులను భర్తి చేశామని, యువతకు 2 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని, తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాల కోసం ఆశలు కల్పించినా కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను విస్మరించిందని భట్టి ఆరోపించారు.

హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ప్రైవేట్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీని ప్రారంభించిన సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం తెలంగాణ యువత చేసిన పోరాటం, బలిదానాల గురించి విద్యార్థులు, యువతకు గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగావకాశాలు కల్పించడంపై దృష్టి సారించలేదన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రెగ్యులర్ రిక్రూట్ మెంట్ జరిగేలా ప్రతి సంవత్సరం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని విక్రమార్క హామీ ఇచ్చారు.

గడిచిన పది నెలల్లో 50 వేల ఖాళీలను భర్తీ చేశామని, మరో 2 లక్షల ఉద్యోగాలకు నియామకాలు పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. సివిల్ సర్వీస్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం రూ.లక్ష సాయం అందిస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణ యువతను సివిల్ సర్వీసెస్, ఇతర ప్రభుత్వ రంగ పరీక్షలకు సిద్ధం చేయడంలో ప్రైవేట్ అకాడమీలు పెద్ద పాత్ర పోషించాలని ఆయన కోరారు.

Next Story