తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావును సీఎస్‌గా ప్రభుత్వం నియమించింది.
మరో వైపు సీఎస్‌గా శాంతి కుమారి పదవీ విరమణ పూర్తికాక ముందే ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. శాంతికుమారిని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) వైస్ ఛైస్ పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.