రాష్ట్రానికి నూతన కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్..సింపుల్‌గా రైలులో హైదరాబాద్‌కు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జ్‌గా నియమితులైన ఏఐసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు.

By Knakam Karthik
Published on : 28 Feb 2025 5:28 AM

Telangana, Hyderabad, Congress New Incharge, Meenakshi Natarajan, Tpcc

రాష్ట్రానికి నూతన కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్..సింపుల్‌గా రైలులో హైదరాబాద్‌కు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జ్‌గా నియమితులైన ఏఐసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. రైలులో కాచిగూడకు చేరుకున్న ఆమెకు టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన వెంట ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, ఫహీం, రచమల్ల సిద్దేశ్వర్ ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాగా, ఇవాళ గాంధీ భవన్‌ లో తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటికి టీపీసీసీ చీఫ్‌ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనున్నారు.

అయితే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీగా నూతనంగా నియమితులైన మీనాక్షి నటరాజన్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , ఏఐసీసీ కార్యదర్శులు, ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పీఏసీ, పీఈసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అధికార ప్రతినిధులు భేటీలో పాల్గొంటారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.

Next Story