నెక్ట్స్ ఐటీ మినిస్టర్ ఎవరు..? కేటీఆర్ గురించి నెట్టింట చర్చ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈసారి రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 4 Dec 2023 11:06 AM GMTనెక్ట్స్ ఐటీ మినిస్టర్ ఎవరు..? కేటీఆర్ గురించి నెట్టింట చర్చ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈసారి రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు. అయితే.. ఎగ్జిట్ పోల్స్ ఇవే ఫలితాలను ముందుగానే అంచనా వేసినా.. బీఆర్ఎస్ నేతల మాటలతో మరోసారి వారే వస్తారని అంతా భావించారు. కానీ.. బీఆర్ఎస్‌కు 39 సీట్లు మాత్రమే వచ్చాయి. 64 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ ఐటీశాఖ మంత్రిగా పని చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఆయనే ఐటీశాఖ మంత్రి కొనసాగారు. అయితే.. పదేళ్లలో కేటీఆర్ అద్భుత సేవలు అందించారు. ఇప్పుడు ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఆయనంత సమర్ధవంతంగా ఐటీ శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తారా అనే ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్ ఎన్నో కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. వివిధ దేశాల్లో పర్యటించి.. వారి పెట్టుబడులను మన రాష్ట్రంలో పెట్టేందుకు ఒప్పించారు. సైబరాబాద్ పరిధిలో అభివృద్ది విషంలో కేటీఆర్ పనితీరు ఎంతో గొప్పగా ఉందంటూ పలువురు సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. కొందరు బీఆర్ఎస్, కేటీఆర్ అభిమానులు అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్ కొనసాగాలంటూ కోరుకుంటున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
IT Employees to KTR : pic.twitter.com/VMHtxBYCS5
— Arehoo_official (@tweetsbyaravind) December 3, 2023
KTR is no more our IT Minister 😖😭💔pic.twitter.com/XIwt23edtT
— WaitWhatt (@emotelidu18) December 3, 2023
మరోవైపు కేటీఆర్ స్థానంలో ఐటీశాఖ విధులను కాంగ్రెస్ నుంచి ఎవరు నిర్వర్తిస్తారనే చర్చకూడా సాగుతోంది. రేసులో ముగ్గురు, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కొందరు కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి అభిమానులు మాత్రం.. సీఎం పదవి రేవంత్‌కు ఇచ్చినా కూడా ఐటీశాఖ ఆయన దగ్గర ఉంచితేనే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటి నాయకుల పేర్లను చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్థాయిలో మాట్లాడే సత్తా, సైబరాబాద్ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్న నాయకుడు కాంగ్రెస్‌లో ఎవరున్నారో అంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. ఎక్కువ మందికి మాత్రం కేటీఆర్‌ను ఐటీశాఖ మంత్రిగా మిస్ అవుతున్నామంటూ చెబుతున్నారు.