వారి సూచనలు తీసుకోండి, SLBC ఆపరేషన్‌పై సీఎం రేవంత్ రివ్యూ

ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

By Knakam Karthik
Published on : 24 March 2025 4:24 PM IST

Telangana, SLBC, Rescue Operation, CM Revanthreddy, Assembly Hall

వారి సూచనలు తీసుకోండి, SLBC ఆపరేషన్‌పై సీఎం రేవంత్ రివ్యూ

ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సొరంగం ప్రమాద విషయంలో సహాయక చర్యలు కొనసాగించాలని, నిరంతర పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన రివ్యూ మీటింగ్‌కు మంత్రులు ఉత్తమ్, జూపల్లి, సీఎస్ శాంతి కుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన సహాయక చర్యల పురోగతిపై అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎంకు ఆర్మీ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని, ఎక్స్‌పర్ట్ కమిటీ సూచనలు తీసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్‌లో ముందుకు వెళ్లాలని సూచించారు.

కాగా, ఎస్ఎల్‌బీసీలో రెస్క్యూ ఆపరేషన్ 32వ రోజుకు చేరుకుంది. సొరంగంలో గత నెల 22న జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. వారిలో గుర్‌ప్రీత్ సింగ్ మృతదేహం మాత్రమే కొద్ది రోజుల క్రితం లభ్యమైంది. మిగతా 7 మందిని గుర్తించేందుకు దేశంలోని అత్యుత్తమ ఏజెన్సీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ పురోగతి కనిపించడం లేదు. అయితే ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు.

Next Story