ప్రాజెక్టుల నీటి కేటాయింపులు పరిష్కరించాలి..కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

తెలంగాణలోని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తిగా జరిగిన తర్వాతనే వరద జలాలు ఎంత మిగులుతాయో లెక్క తేలుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

By Knakam Karthik  Published on  3 March 2025 5:24 PM IST
Telangana, CM Revanthreddy, Union Minister for Water Resources CR Patil

ప్రాజెక్టుల నీటి కేటాయింపులు పరిష్కరించాలి..కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

తెలంగాణలోని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తిగా జరిగిన తర్వాతనే వరద జలాలు ఎంత మిగులుతాయో లెక్క తేలుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్.పాటిల్‌తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. మాకు నికర జలాలపై నిర్మిస్తున్న సమ్మక్క సారక్క , సీతారామ ప్రాజెక్టు నిక్కర జలాల కేటాయింపులు ఇంకా జరగలేదు. ఏపీ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం చెప్తుంది. మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు పూర్తయిన తర్వాతే వరద జలాల లెక్క తేలుతుంది. గోదావరి నదిపై నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల నీటి కేటాయింపులు పూర్తి అయిన తర్వాతే ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి. మా ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ ఫైనల్ క్లియరెన్స్ ఇంకా రాలేదు. ఏపీ కూడా ఈ విషయాలపైన అభ్యంతరాలు పెడుతుంది. గోదావరి వరద జలాలను బనకచర్లకు కృష్ణా బేసిక్ తరలిస్తామని చెప్తుంది. మీరు వరద జలాలు ఉపయోగించుకోవాలనుకుంటున్న నేపథ్యంలో మా నికరజలాల ప్రాజెక్టులకు అభ్యంతరాలు ఎందుకు..అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.

మా ఆయకట్టును స్థిరీకరించకపోతే కేటాయింపులు ఎలా జరుగుతాయి? ఆయకట్టు చివరి భూములకు స్థిరీకరణ జరిగితే ముందుగా వాటికే కేటాయింపులు జరుపుతారు. కృష్ణా డెల్టా స్థిరీకరణ జరగడం వల్ల 811 టీఎంసీల నీటిలో 512 టీఎంసీలు ఏపీ ఉపయోగించుకుంటుంది, కేవలం 299 టీఎంసీలు మాత్రం తెలంగాణ ఉపయోగించుకుంటుంది. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తికాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఏపీ ప్రాజెక్టులు పూర్తికావడం వల్ల వాటికి కేటాయింపులు ఎక్కువ జరిగాయి. కృష్ణానది మీద ఎదురయ్య సమస్యను, గోదావరి నది మీద ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేము. గోదావరి నదిపై నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల నీటి కేటాయింపులు ముందుగా పరిష్కారం కావాలి. మా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తిగా జరిగిన తర్వాతనే ఎన్ని వరద జలాలు మిగులుతాయని లెక్క తేలుతుంది. అప్పుడు మీరు ఏం కట్టుకోవాలి అనుకుంటున్నారో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. జీఆర్ఎంబిలో చర్చించి అప్పుడు దానిపైన అభ్యంతరం ఉందా లేదా అనేది చర్చ చేస్తాం. శాశ్వత నికరజలాల ప్రాజెక్టులపై అభ్యంతరాలు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి. మా ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించేటట్లు సహకరించాలి. మా అనుమతులు క్లియర్ అయితేనే మీ అనుమతులు క్లియర్ అవుతాయి. మా ప్రాజెక్టుల భవిష్యత్తు గందరగోళంలో ఉన్నప్పుడు, ఏపీ ప్రభుత్వం వరద జలాలపై ప్రాజెక్టులు కట్టుకుంటామంటే తెలంగాణకు అభ్యంతరం ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి శషాభిషాలకి తావు లేదు" అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Next Story