Telangana: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
దేశ ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
By అంజి
Telangana: స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
దేశ ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'స్వాతంత్ర్యం సాధన నుంచి.. ఆధునిక దేశ నిర్మాణం వరకు.. జాతి ప్రస్థానంలో తమ జీవితాలను అర్పించిన మహనీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు' సీఎం రేవంత్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది పరేడ్ నిర్వహించారు. వేడుకల సందర్భంగా తెలంగాణ జానపద, నృత్య రీతులు కళా రూపాలను ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు మెడల్స్‌ను ముఖ్యమంత్రి పోలీసు అధికారులకు ప్రదానం చేశారు.
అటు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. సాయంత్రం 5.30కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎట్‌హోం నిర్వహించనున్నారు. తేనీటి విందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, వివిధ పార్టీల నేతలు ప్రముఖులు హాజరుకానున్నారు.