ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్

Telangana CM KCR greets PM Modi on birthday.ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శ‌నివారం 72వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Sept 2022 10:44 AM IST
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శ‌నివారం 72వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. 1950 సెప్టెంబ‌ర్ 17న గుజ‌రాత్‌లోని మోహ‌సాసా జిల్లాలోని వాద్‌న‌గ‌ర్‌లో మోదీ జ‌న్మించారు. మోదీ పుట్టిన రోజు సంద‌ర్భంగా సామాన్యుల ద‌గ్గ‌ర నుంచి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు, ప్ర‌పంచ దేశాధినేత‌లు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌తి ముర్ము, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ప‌లువురు శుభాకాంక్షలు తెలిపారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి వ్య‌క్తిగ‌తంగా, రాష్ట్ర ప్ర‌భుత్వం, తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌పున ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. మోదీకి భ‌గ‌వంతుడు ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. దేశానికి ఇంకా చాలా ఏండ్లు సేవ చేసేలా ఆరోగ్యంగా ఉండాల‌ని కేసీఆర్ ప్రార్థించారు. ఈ మేరకు కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన లేఖను సీఎంవో కార్యాలయం ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. సాటిలేని కఠోర శ్రమ, అంకితభావం, సృజనాత్మకతతో మీరు చేపడుతున్న దేశ నిర్మాణ సంగ్రామం మీ నాయకత్వంలో కొనసాగాలని కోరుకుంటున్నాను. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అన్నారు. - రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

దేశ అభిమాన నాయకుడు, మనందరికీ స్ఫూర్తి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు పొందాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మోడీ జీ మొదటి ఆలోచన భారతదేశం, పేదల సంక్షేమం కోసం సంకల్పంతో అసాధ్యమైన పనులను సుసాధ్యం చేశారు - కేంద్ర హోం మంత్రి అమిత్ షా

గౌరవనీయులైన ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని జగన్ ట్వీట్ చేశారు. ప్రధానికి ఆయురారోగ్యాలను భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

Next Story