తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి.. 7న ప్ర‌మాణ‌స్వీకారం

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఫైన‌ల్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించారు.

By Medi Samrat  Published on  5 Dec 2023 6:44 PM IST
తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి.. 7న ప్ర‌మాణ‌స్వీకారం

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఫైన‌ల్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని ఢిల్లీలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్ర‌క‌టించారు. భారీ విజ‌యాన్ని అందించిన తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. 7వ తేదీన సీఎంగా రేవంత్ ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌ని తెలిపారు. సీనియ‌ర్లు అంద‌రికీ న్యాయం జ‌రుగుతుంది. అంతా టీమ్‌గా ప‌ని చేస్తారు అని కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఇక డిప్యూటీ సీఎంలు ఎవ‌రనే విష‌యంపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త ఇస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.


Next Story