రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. రుణమాఫీపై చర్చ

సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రేపు కేబినెట్‌ భేటీ కానుంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై మంత్రి వర్గం చర్చించనున్నట్టు సమాచారం.

By అంజి
Published on : 17 May 2024 4:42 PM IST

Telangana, cabinet meeting , loan waiver

రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. రుణమాఫీపై చర్చ

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రేపు కేబినెట్‌ భేటీ కానుంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్‌ పంటల ప్రణాళిక, రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై మంత్రి వర్గం చర్చించనున్నట్టు సమాచారం. అలాగే రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలు, ఏపీతో ఉన్న సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశాలపై నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.

దీంతో పాటు రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలతో తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమర్పించిన నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

Next Story