హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఈ సందర్భంగా కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. హైకోర్ట్, సుప్రీంకోర్ట్ ఆదేశాల ఆధారంగా BC రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోది. స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరో వైపు ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసే ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించే అవకాశం ఉంది. కాళేశ్వరం, SLBC పునరుద్ధరణ, SRSP దశ-II పనులపై సమీక్ష చేయనున్నారు. మరో ప్రధాన అంశం రైతుభరోసా పథకంపై ప్రధాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో కొత్త పథకం విధివిధానాలపై కూడా కేబినెట్‌లో రూపకల్పన చేసే అవకాశం ఉంది.