ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ

ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.

By Knakam Karthik  Published on  4 March 2025 4:13 PM IST
Telangana, Cabinet Meeting, Cm Revanthreddy,

ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ

ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్న 2 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. కాగా ఈ భేటీలో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను చర్చించనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులపై చర్చించగా.. వాటిపై రాష్ట్ర మంత్రివర్గంలో సీఎం చర్చించనున్నారు.

అదే విధంగా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో మహిళలకు లబ్ధి చేకూరేలా మరిన్ని కొత్త పథకాలు తీసుకురానున్నట్లు సర్కార్ నిర్ణయం తీసుకుది. ఆయా పథకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆయా పథకాలపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. అయితే బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నెల రెండో వారంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అంశాలు కూడా ఈ చర్చలో కీలకంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తున్న బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదముద్ర వేయనున్నారు. ఈ బిల్లుకు ఎలాగైనా పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ ధృడ నిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే.

Next Story