తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. కొత్త రేషన్ కార్డుల జారీ విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్‌కి రికమండ్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మూసీలో ఎప్పటికీ మంచి నీరు ఉండేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.