Telangana : ఆ లోపే 'మంత్రివర్గ' విస్తరణ..!

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబరు 9న ప్రారంభం కానుండగా.. సమావేశాలు ప్రారంభం కాకముందే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నాయి.

By Medi Samrat  Published on  22 Nov 2024 5:49 AM GMT
Telangana : ఆ లోపే మంత్రివర్గ విస్తరణ..!

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబరు 9న ప్రారంభం కానుండగా.. సమావేశాలు ప్రారంభం కాకముందే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణ ప్రక్రియ డిసెంబర్ 7 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా 12 మంది మంత్రులు ఉండగా.. ఆరుగురు అదనపు సభ్యులకు అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తికాక ముందే ఈ స్థానాలను భర్తీ చేయాలని భావిస్తున్నారు. కొత్త మంత్రుల జాబితాను ఖరారు చేసేందుకు ప్రభుత్వం, పార్టీ అగ్రనేతల మధ్య సంప్రదింపులు ముమ్మరంగా జరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

స్పీకర్ నిర్ణయం తర్వాత అసెంబ్లీ, మండలి సమావేశాలు రెండింటి ప్రారంభానికి సంబంధించి అసెంబ్లీ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ సెషన్‌లో తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్, రెవెన్యూ శాఖ చట్టాలకు సవరణలు, హైడ్రా అధికారాలు, మూసీ నది పునరుద్ధరణపై చర్చలు జరగనున్నాయి. పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపుల అనంతరం మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Next Story