సీఎం కేసీఆర్ సోమవారం అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధులను ప్రకటించారు. అలాగే తెలంగాణ కేబినెట్ విస్తరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈటల బర్తరఫ్‌తో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసే ప్లాన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. మాజీమంత్రి కేకే మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం సీఎంను మహేందర్‌రెడ్డి కలిశారు.
బేటీ అనంతరం ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎల్లుండి రాజ్‌భవన్‌లో ఉదయం 11:30 గంటలకు మంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేస్తానని వెల్లడించారు. మధ్యాహ్నం గవర్నర్‌తో సీఎం కేసీఆర్ మాట్లాడారని చెప్పారు. మంత్రి కేటీఆర్ అన్నీ సెట్ చేసి విదేశాలకు వెళ్లారని వెల్లడించారు.