రైతులకు శుభవార్త.. రుణమాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

రైతుల‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన‌ట్లు సీఎం రేవంత్ తెలిపారు

By Medi Samrat  Published on  21 Jun 2024 1:59 PM GMT
రైతులకు శుభవార్త.. రుణమాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

రైతుల‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన‌ట్లు సీఎం రేవంత్ తెలిపారు. డిసెంబర్ 9, 2023 ముందు నాటికి తీసుకున్న రుణాలన్నింటినీ ఒకే విడతలో మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 47 లక్షలకు పైగా మంది రైతులకు ఊరట లభించనుంది.

ఇదిలావుంటే.. ఎన్నికల హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో రుణామాఫీలు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండటం కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ లేకపోవడంతో రుణాల మాఫీపై స్పీడ్ పెంచింది సర్కార్. ప్రధానంగా ఆగస్ట్ 15 లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటన చేసిన నేప‌థ్యంలో మంత్రివ‌ర్గం స‌మావేశ‌మై విధివిధినాల‌పై చ‌ర్చించిన‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Next Story