Video : ఎడ్ల‌ బండిపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా విన‌త్న‌ రీతిలో నిరసన తెలుపుతూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేలు ఎడ్ల‌ బండిపై అసెంబ్లీకి వచ్చారు.

By Kalasani Durgapraveen  Published on  19 Dec 2024 6:04 AM GMT
Video : ఎడ్ల‌ బండిపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా విన‌త్న‌ రీతిలో నిరసన తెలుపుతూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేలు ఎడ్ల‌ బండిపై అసెంబ్లీకి వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, రామారావు పటేల్ త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ జరపలేదని ఎమ్మెల్యేలు విమర్శించారు.

ఇటీవల బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయడంతో ఆటోరిక్షా డ్రైవర్లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆటోరిక్షా డ్రైవర్లకు సంఘీభావంగా ఖాకీ చొక్కాలు ధరించి మూడు చక్రాల వాహనాల్లో అసెంబ్లీ, కౌన్సిల్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోరిక్షా డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story