బీజేపీకి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గుడ్‌బై చెప్తారా?
రఘునందన్‌రావు బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 1 July 2023 11:18 AM GMTబీజేపీకి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గుడ్‌బై చెప్తారా?
బీజేపీ నుంచి పోటీ చేసిన రఘునందన్‌రావు దుబ్బాక ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడి నుంచి తెలంగాణలో బీజేపీ పుంజుకుందనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా యాక్టివ్ అయ్యారు. అయితే.. రఘునందన్‌రావు బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పార్టీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై రఘునందన్‌రావు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక జాతీయ నాయకత్వం తనని పెద్దగా పట్టించుకోవడం లేదన్న అసంతృప్తిలో కూడా ఉన్నారట. అందుకే కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
పార్టీలో అసంతృప్తిగా ఉన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. రఘునందన్‌రావుకి సంబంధించిన మరోవార్త చర్చనీయాంశంగా మారింది. రఘునందన్ త్వరలోనే బీఆర్ఎస్‌లో చేరతారని తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో.. తెలంగాణలో అధికారం చేపట్టాలని కలలు కంటున్న బీజేపీకి మరో షాక్ తగిలినట్లు అయ్యింది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో అసంతృప్తులు ఎక్కువయ్యారు. అసలే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వార్తలు బీజేపీకి తలనొప్పిగా మారాయనే చెప్పాలి. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ డీలా పడిందని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ నుంచి అగ్రనేతలు వచ్చి బహిరంగ సభల్లో పాల్గొంటున్నా.. కాషాయ కండువా కప్పుకునేందుకు పార్టీ నేతలెవరూ ముందుకు రావడం లేదు.
మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని మారుస్తారని ప్రచారం సాగుతోంది. ఆ బాద్యతలు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఇస్తారనే టాక్ నడుస్తోంది. అంతకుముందు ఈటల రాజేందర్ కూడా పార్టీలో యాక్టివ్‌గా కనిపించలేదు. ఈటల కూడా పార్టీ మారతారనే వార్తలు వినిపించాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా అదే దారిలో ఉన్నారని తెలుస్తోంది. మరి రాష్ట్ర బీజేపీలో అందరిని సంతృప్తి పరిచేలా జాతీయ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.