బండి సంజయ్ బెయిల్ పిటీషన్ కొట్టివేత

టెన్త్‌ హిందీ పేపర్‌ లీక్‌ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఊరట లభించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 April 2023 5:00 PM IST
Telangana, Bandi Sanjay, hanamkonda court, 10th paper leak

బండి సంజయ్ బెయిల్ పిటీషన్ కొట్టివేత 

టెన్త్‌ హిందీ పేపర్‌ లీక్‌ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఊరట లభించింది. బండి సంజయ్‌ బెయిల్ రద్దు పిటిషన్ ను హన్మకొండ కోర్టు గురువారం కొట్టి వేసింది. సంజయ్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కొట్టివేస్తున్నట్లు తెలిపింది. బండి సంజయ్ బయట ఉండటం వల్ల విచారణ ఆలస్యమవుతుందని పోలీసులు కోర్టులో వాదనలు వినిపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఆయన బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు కోరుతున్నారని ఆయన తరపున వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనల అనంతరం మెజిస్ట్రేట్ బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టివేశారు. బండి సంజయ్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఈనెల 17న హన్మకొండ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం కోర్టు విచారణ చేపట్టింది.

Next Story