ఫలితాల్లో వెనుకంజలో ఆరుగురు బీఆర్ఎస్ మంత్రులు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla
ఫలితాల్లో వెనుకంజలో ఆరుగురు బీఆర్ఎస్ మంత్రులు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లీడింగ్‌లో కొనసాగుతుంది. 66 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. అధికార పార్టీకి బీఆర్ఎస్‌కు ఈసారి ఓటమి తప్పేలా లేదు. అయితే.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏమో కానీ.. బీఆర్ఎస్ మంత్రులు కూడా ఆయా చోట్ల వెనుకంజలో ఉన్నారు. దాంతో.. ఓటర్లు ఈసారి బీఆర్ఎస్‌కు మద్దతు తెలపలేదనే అర్థం అవుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ మంత్రులు పలువురు వెనుకంజలో ఉన్నారు. మరికొందరు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వనపర్తి నుంచి పోటీ చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి వెనుకంజలో ఉన్నారు. బాల్కొండ నుంచి ప్రశాంత్‌రెడ్డి, పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్, నిర్మల్ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మం నుంచి పోటీ చేసిన పువ్వాడ అజయ్ కూడా వెనుకంజలో ఉన్నారు.
ఇక సూర్యపేట నుంచి బరిలో ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డి తొలుత వెనుకంజలో ఉన్నా.. ఆ తర్వాత లీడింగ్‌లోకి వచ్చారు. మేడ్చల్ నుంచి మంత్రి మల్లారెడ్డి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, సిద్దిపేట నుంచి హరీశ్‌రావు, సిరిసిల్ల నుంచి కేటీఆర్, సనత్‌నగర్ నుంచి తలసాని శ్రీనివాస్, మహబూబ్‌నగర్ నుంచి శ్రీనివాస్‌గౌడ్ ముందంజలో కొనసాగుతున్నారు. అయితే... ఇప్పటికే కాంగ్రెస్ జోరు కనిపిస్తుండటంతో ఆ పార్టీ అగ్రనేతలు అప్రమత్తం అవుతున్నారు. పార్టీలు ఫిరాయించకుండా.. గెలిచిన వారిని కాపాడుకునేందుకు రిసార్ట్‌లకు తరలించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.