ప్రజల కోసమే పార్టీలు మారా.. విమర్శలు సరికాదు: రాజగోపాల్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  21 Dec 2023 2:52 PM IST
telangana, assembly, rajagopal reddy, congress, jagadish reddy, brs,

  ప్రజల కోసమే పార్టీలు మారా.. విమర్శలు సరికాదు: రాజగోపాల్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ త్వరలోనే కనుమరుగు కావడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ సభ్యులను బ్రహ్మ దేవుడు కూడా కాపడలేరని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. అయితే.. తాను పార్టీలు మారానంటూ విమర్శలు చేస్తూ.. అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఇది ఏమాత్రం సరికాదని అన్నారు. తాను ప్రజల కోసమే పార్టీలు మారాను అని చెప్పారు. ఒక పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే మరో పార్టీలో చేరానని స్పష్టం చేశారు రాజగోపాల్‌రెడ్డి. పార్టీలు మారి ప్రజలను మోసం చేశానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ప్రతిపక్ష పార్టీ నాయకులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు.

అభివృద్ధి పేరుతో పదేళ్ల పాటు ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందనీ.. ఆ పార్టీ నాయుకులు విపరీతంగా అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులు ప్రతిసారీ పార్టీ మార్పులపై విమర్శలు చేస్తున్నారనీ అన్నారు. వేల కోట్ల రూపాయల విలువైన బంగ్లాలు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

ఇదే అంశంపై స్పందించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి.. రాజగోపాల్‌రెడ్డి విమర్శలను తిప్పికొట్టారు. తానె ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదని చెప్పారు జగదీశ్‌రెడ్డి. వ్యక్తి విమర్శలు కోమటిరెడ్డి అన్నదమ్ములకే అలవాటు అంటూ మండిపడ్డారు. అవసరాలు, అధికారం, కాంట్రాక్టుల కోఐసం పార్టీ మారే కోమటిరెడ్డి బ్రదర్స్ తన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పారు. రాజగోపల్‌రెడ్డి వాడిన పరుష పదం ఎవరిని ఉద్దేశించి అన్నారు అంటూ నిలదీశారు. వ్యక్తిగత విమర్శలు ఎవరు ప్రారంభించారో అంటూ రాజగోపాల్‌రెడ్డిని పరోక్షంగా ప్రశ్నించారు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి.

Next Story