గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌లా ఉంది, గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు: కేటీఆర్

గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ మాదిరిగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

By Knakam Karthik
Published on : 12 March 2025 1:02 PM IST

Telangana, TG Assembly, Assembly Budget Sessions, Governor Jishnu Dev Verma, Ktr

గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌లా ఉంది, గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం, గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ మాదిరిగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ వాయిదా పడటంతో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో కొత్త విషయాలు ఏమీ లేవు. గవర్నర్‌తో అన్ని అబద్ధాలు చెప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. 400 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల సమస్యలపై గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావించలేదు. సాగునీటితో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 100 శాతం రైతు రుణమాఫీ జరగలేదు. గవర్నర్ స్థాయిని ఈ ప్రసంగం దిగజార్చింది...అని కేటీఆర్ విమర్శించారు.

గత 15 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాలను అంగీకరిస్తారేమోనని అసెంబ్లీకి వచ్చాం. కానీ, అది జరిగేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో 400 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. రేవంత్ చేతకానితనం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు బాధ పడుతున్నారు. కానీ, రైతు సమస్యలపై గవర్నర్ ప్రసంగంలో ఊసే లేదు. సాగునీటి తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటిదాకా 30 శాతం మించి రుణమాఫీ జరగలేదు. సాగు నీటి సంక్షోభం నెలకొన్నది. కేసీఆర్(KCR)పై కోపంతో మేడిగడ్డకు మరమత్తులు చేయించడం లేదు. 20% కమిషన్ కోసం కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. సిగ్గుపడాల్సిన విషయం ఇది..అని కేటీఆర్ విమర్శించారు.

గురుకులాల్లో అధ్వానమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో అప్పులు చేశారంటూ గుండె బాదుకున్న సన్నాసులు.. ఏడాదిలోనే 1లక్ష 50 వేల కోట్ల అప్పు చేశారు. ఈ అంశం గవర్నరు ప్రసంగం లో లేదు. ఏడాదిలోనే వరి ధాన్యం పండించామని దేశంలో నెంబర్ వన్ అని చెప్పుకున్నారు. సిగ్గులేదు ఈ కాంగ్రెస్ పార్టీకి. గ్రామాలకు వెళ్తే తరిమి కొడుతున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.

Next Story