అసెంబ్లీ సుదీర్ఘంగా సాగించడంపై కేటీఆర్‌ కీలక సూచన

తెలంగాణ అసెంబ్లీ సోమవారం సుదీర్ఘంగా కొనసాగిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  30 July 2024 6:18 AM GMT
Telangana, assembly, brs, ktr , long time session,

అసెంబ్లీ సుదీర్ఘంగా సాగించడంపై కేటీఆర్‌ కీలక సూచన 

తెలంగాణ అసెంబ్లీ సోమవారం సుదీర్ఘంగా కొనసాగిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యిన సమావేశాలు.. మంగళవారం తెల్లవారుజామున 11 గంటల వరకు కొనసాగాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ బాబుకి కీలక సూచన చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ అనుమతితో కేటీఆర్ మాట్లాడి ఈ సూచనలు చేశారు.

ఒకే రోజు 19 పద్దులపై చర్చ జరిపి అప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మంగళవారం తెల్లవారుజాము 3 గంటల వరకు సభను నడిపారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ ప్రసంగాలు చేయొద్దన్న శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే.. అసెంబ్లీలో ఈ సారి 57 మంది కొత్త సభ్యులు ఉన్నారనీ.. వారందరూ మాట్లాడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇక నుంచి రోజుకు 19 ప‌ద్దుల‌పై చ‌ర్చ పెట్ట‌కుండా.. రోజుకు 2 లేదా 3 ప‌ద్దుల‌పైన చ‌ర్చ పెట్టాల‌ని కోరుతున్నట్లు పేర్కొన్నారు కేటీఆర్. ఇక వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో రోజుకు 2 నుంచి 3 పద్దులపై సావధానంగా చర్చ జరిగేలా చ ర్యలు తీసుకోవాలన్నారు. మంత్రులు కూడా సుదీర్ఘ వివరణ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. అవసరమైతే బడ్జెట్ సెషన్‌ను 20 రోజులు అయినా నిర్వహించాలని చెప్పారు. తమ వైపు నుంచి తప్పకుండా సహకారం అందిస్తామని కేటీఆర్ చెప్పారు.

Next Story