తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటల నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభం రోజునే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది. అసెంబ్లీ, మండలి సమావేశాలపై ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందింది. రాష్ట్ర బడ్జెట్ 2023-24 సంబంధించి సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, సంబంధిత అధికారులు హాజరయ్యారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. శాసనసభ ప్రారంభం రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2022-23లో ప్రభుత్వ వ్యయం ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు దాటింది.వచ్చే ఆర్థిక సంవత్సరం అంతకు మించి ఉండనుంది.