తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఫలితాలను మధ్యాహ్నం 2.15 గంటలకు రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో 98.2 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.7 శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. GPA విధానాన్ని తొలగించిన నేపథ్యంలో సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడింగ్స్ ఇవ్వనున్నారు. అలాగే, మార్కులు సైతం ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 5లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ లో చూసుకోవచ్చు.