ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ వేదికగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశం అవనుంది. రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణ, తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నిక విషయం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇదిలావుంటే.. శనివారం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. భారత బ్యాంకుల నుంచి లక్షల కోట్లు విత్‌డ్రా చేసుకొని విదేశాలకు పారిపోతున్నారని, దీనిపై ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇలా ఒకపక్క కార్పొరేట్లకు దోచిపెడుతూ.. పేద ప్రజలకు ఇచ్చే ఉచితాలు ఇవ్వొద్దని చెప్పడం ఎంత వరకు సబబు అని మండిపడ్డారు. కార్పొరేట్ దొంగలకు ఇలా లోన్లు ఇవ్వడం ఉచితాలు కాదా? అని నిలదీశారు. ఇదేనా మేకిన్ ఇండియా.. అని నిప్పులు చెరిగారు.