అది బూతు కాదు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడి ఘటనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు
By Medi Samrat
క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడి ఘటనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు. దాడి అనంతరం ఆఫీస్ ఎదుట మీడియాతో మాట్లాడారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. ఇలాంటి దాడులకు మల్లన్న భయపడుతాడు అనుకుంటే అది మీ భ్రమే అవుతుందన్నారు. మా గన్‌మెన్ వద్ద నున్న తుపాకీ లాక్కొని మరీ మా సిబ్బందిపై దాడి చేశారు. నాతో సహా పలువురికి గాయాలు అయ్యాయని వివరించారు.
కల్వకుంట్ల కవిత ఆమె కుటుంబం మాపై హత్యాయత్నానికి పాల్పడిందని.. ఇక మేము ఊరుకోం.. మీరో, మేమో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నేను మాట్లాడింది కాదు అన్నారు. కంచం-మంచం అనేది తెలంగాణలో ఊతపదం.. కంచం పొత్తు అనగా తినడం, కలసి ఉండటం కలసి పని చేయడం గురించి.. మంచం పొత్తు అనగా వియ్యం ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం (పెళ్లి సంబంధాలు) అని అర్థంలో వాడుతారు.. అది బూతు కాదు.. మరి వారి అర్థం వేరే ఉందేమో.. నేను చేసిన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడే ఉన్నానన్నారు. నేనేం తప్పు మాట్లాడానో ప్రజలు నిర్ణయిస్తారు. రౌడీల్లా మాపై దాడి చేయడమే కాకుండా.. మళ్లీ నామీదే కేసు పెట్టారు. నా ఆఫీస్‌లో నా రక్తం కళ్లజూశారు. ఈ రక్తం మరకలతోనే ప్రజల్లోకి వెళ్తాననన్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలి. ఈ దాడి ఘటనపై ఇప్పటికే కంప్లైంట్ చేశాం. పోలీసులపై, వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందనే నమ్ముతున్నామని తీన్మార్ మలన్న అన్నారు.