చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్ మార్ మల్లన్న అరెస్టు అయ్యారు. హయత్ నగర్ మునగనూరులోని మెజిస్టేట్ ముందు తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురుని మేడిపల్లి పోలీసులు హాజరుపరిచారు. వారికి 14రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మల్లన్నతో పాటు మిగతా నలుగురిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఫిర్జాదీగూడ, రాఘవేంద్ర భవన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులను బలవంతంగా కిడ్నాప్ చేయడం, వారిని అక్రమంగా నిర్బంధించడం, విధుల్లో ఉన్న పోలీసు అధికారులపై దాడి చేయడం వంటి అంశాలపై పోలీసులు తీన్మార్ మల్లన్న, అతడి సిబ్బంది కేసు నమోదు చేశారు. ఎస్‌వోటీ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లన్న టీమ్‌పై 363 ,342, 395, 332, 307 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ 7 (1) కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 8 మంది ఉన్నట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. వారిలో ఆరుగురు పోలీసుల అదుపులో ఉండగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.