ఏటీఎంలో కాసుల వర్షం.. అదృష్టం అంటే వారిదే
Technical Error in ATM Machine. ఏటీఎంలో కాసుల వర్షం.. అదృష్టం అంటే వారిదే
By Medi Samrat
ఆ ఏటీఎంలో రూ. 500 విత్ డ్రా అంటూ నెంబర్ కొట్టాడో వ్యక్తి.. ఏకంగా 2,500 వచ్చాయి.. ఆ తర్వాత నాలుగు వేలు డ్రా చేశాడు మరో వ్యక్తి.. ఏకంగా 20వేల రూపాయలు వచ్చాయి. ఇంతకూ అలా డబ్బులు అనుకున్న దానికంటే ఎక్కువ ఎలా వస్తున్నాయా అనే కదా డౌట్..! ఆ ఏటీఎంలో చిన్న పొరపాటు కారణంగా వందకు బదులుగా 500 రూపాయల నోట్లు వచ్చాయి. దీంతో కాసుల వర్షంతో వారి పంట పండింది.
ఈ ఘటన వనపర్తి జిల్లా అమరచింతలో చోటు చేసుకుంది. ఓ ఏటీఎంలో 100 విత్ డ్రా చేస్తూ ఉంటే 500 రూపాయలు వస్తోంది. విషయం తెలుసుకున్న జనం పెద్ద ఎత్తున విత్ డ్రా చేయడం మొదలు పెట్టారు. తమకు తెలిసిన వాళ్లకు చెప్పి కూడా విత్ డ్రాలను చేయించారు. ఏటీఎం ముందు ప్రజలు బారులు తీరడతో విషయం చాలా మందికి తెలిసింది. మొత్తం 5.8 లక్షల రూపాయల సొమ్మును ప్రజలు విత్ డ్రా చేసుకున్నారు. లాక్ డౌన్ సూచనలను పట్టించుకోకుండా ప్రజలు అలా వ్యవహరిస్తూ ఉండడంతో పోలీసుల చెవుల్లో విషయం పడింది. సమచారం అందుకున్న పోలీసులు సదరు ఏటీఎం సెంటర్ ను మూసివేశారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. వందకు బదులు 500 వచ్చిన వాళ్లు సంతోషాన్ని వ్యక్తం చేయగా.. మిగిలిన వాళ్లు ఈ అదృష్టాన్ని కోల్పోయామే అని బాధపడ్డారు.