ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రేపే.. ఏర్పాట్లు పూర్తి

Teachers MLC Counting of Votes Tomorrow. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని

By Medi Samrat  Published on  15 March 2023 9:15 PM IST
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రేపే.. ఏర్పాట్లు పూర్తి

Teachers MLC Counting of Votes Tomorrow


మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ ను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు కోసం అన్ని సిద్దం చేశారని గత ఎన్నికలలో ఒకే రౌండ్ లో లెక్కింపు పూర్తయ్యిందని, ఈ సారి కూడా ఓకే రౌండ్ లో పూర్తి కాక పోతే రెండో రౌండ్ లెక్కింపు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లను ఆర్ ఓ పూర్తి చేశారని తెలిపారు.


అనంతరం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించి ఏర్పాట్ల పై పలు సూచనలు జారీ చేశారు. వీరి వెంట రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంక అలా, ఏ.ఆర్.ఓ పంకజ, ఎస్ సి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం - రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా వెల్లడి

రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా మాట్లాడుతూ.. కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అందు కోసం సిబ్బంది, సూపర్ వైజార్ లు, అబ్జర్వర్లు ఉదయం 6.30 గంటల లోపు కౌంటింగ్ కేంద్రంలో ఉండాలి. ఏజెంట్లు ఉదయం 7 గంటల వరకు కౌంటింగ్ కేంద్రానికి రావాల్సి ఉంటుందని ఆర్ఓ తెలిపారు. కౌంటింగ్ కోసం 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. రెండు రూం లను ఏర్పాటు చేసి ఒక్కో రూమ్ లో 14 చొప్పున 28 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి టేబుల్ కి ఒక సూపర్ వైజర్, ఇద్దరు సిబ్బంది, ఒక అబ్జర్వర్ ను నియమించారు. ఒక్కో రూం కు ముగ్గురు ఏ.ఆర్.ఓ లు, రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద మరో ముగ్గురు ఏ.ఆర్.ఓ లు గా అడిషనల్ కలెక్టర్ లను నియమించామన్నారు.


Next Story