గవర్నర్‌తో ముగిసిన టీ కాంగ్రెస్‌ బృందం భేటీ

T Congress Leaders Meet With Governor. తెలంగాణ‌ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్‌తో టీ కాంగ్రెస్‌ బృందం మంగ‌ళ‌వారం

By Medi Samrat
Published on : 25 Jan 2022 3:32 PM IST

గవర్నర్‌తో ముగిసిన టీ కాంగ్రెస్‌ బృందం భేటీ

తెలంగాణ‌ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్‌తో టీ కాంగ్రెస్‌ బృందం మంగ‌ళ‌వారం భేటీ అయ్యింది. కొద్దిసేప‌టి క్రితం భేటీ ముగిసింది. ఈ సంద‌ర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ వైఫల్యం చెందింద‌ని.. టీఆర్ఎస్ నేతలు పోలీసుల‌ను వాళ్ళ పని చేయనియ్యడం లేదని అన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్‌కు వనమా రాఘవా దాష్టికం, రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, మంథని లో అడ్వ‌కేట్ హత్య, శీలం రంగయ్య ఘటనలు గుర్తు చేసామన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. పోలీస్ శాఖపై గవర్నర్ సమీక్ష చేయాలని కోరామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీస్, పోలీస్ లాగా పనిచేయడం లేదని.. పోలీస్ నుంచి రక్షణ ఉంటది అనే భావన ప్రజలు కోల్పోయారని భట్టి విక్రమార్క అన్నారు. టీఆర్ఎస్ నాయకులు చెప్తేనే పోలీస్ దగ్గర న్యాయం జరుగుతుందని.. రాజ్యాంగం ప్రకారం పోలీస్ తన విధులు తను విధించాలని.. ఒత్తిళ్లకు లొంగోద్దని భట్టి అన్నారు. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన వారిలో ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌, మంథ‌ని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.



Next Story