తెలంగాణ సీఎం అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్.. ఆయన చేతిలోనే అంతిమ నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ప్రకటపై ఇంకా సస్పెన్స్‌ వీడలేదు. ముఖ్యమంత్రి రేసులో రేవంత్‌ పేరు ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నప్పటీకీ అధికార ప్రకటన రాలేదు.

By అంజి  Published on  5 Dec 2023 1:48 AM GMT
Telangana, CM candidate, Kharge, Congress

తెలంగాణ సీఎం అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్.. ఆయన చేతిలోనే అంతిమ నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ప్రకటపై ఇంకా సస్పెన్స్‌ వీడలేదు. ముఖ్యమంత్రి రేసులో రేవంత్‌ పేరు ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నప్పటీకీ అధికార ప్రకటన రాలేదు. ఆయనతో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ పేర్లను అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రేవంత్‌ రెడ్డివైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్‌ వల్లే కేసీఆర్‌ను తట్టుకుని కాంగ్రెస్‌ నిలబడిందని, ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. మరోవైపు సీనియర్లైన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌ బాబులో ఎవరికో ఒకరికి ఇవ్వాలన్న డిమాండ్లూ వస్తున్నారు.

దీనిపై ఇవాళ పార్టీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గేతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ అబ్జర్వర్లు సమావేశం కానున్నారు. దీంతో సీఎం ఎవరనే విషయంలో నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నిన్న రాజ్‌భవన్‌లో టెంట్లు, కుర్చీలు సహా అన్ని ఏర్పాట్లు చేసిన పోలీసులు.. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిని తేల్చకపోవడంతో అన్నీ సర్దుకుని వెళ్లిపోయారు. సీఎం ఎవరనే ప్రశ్నకు ఇంకా సమాధానం కోసం వెతుకుతోంది కాంగ్రెస్‌ అధిష్ఠానం.

మార్పు కావాలి అన్న కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇచ్చినా.. ఆ పార్టీ తీరు మాత్రం మారడం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కొత్త సీఎంపై అధిష్ఠానం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. రాజస్థాన్‌, కర్ణాటకలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని, ఇక మార్పు రాదా? అని చర్చలు చేస్తున్నారు. అధికారంలోకి రాక ముందే పార్టీలో అంతర్గత గొడవలు ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలాగా ఒక్కరే బాస్‌ ఉండరని, తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందని కాంగ్రెస్‌ కార్యకర్తలు డిఫెండ్‌ చేసుకుంటున్నారు.

Next Story