కామారెడ్డి జిల్లాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి మంకీ ఫాక్స్ అనుమానిత లక్షణాలతో నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తికి నెగెటివ్ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకులు (డిపిహెచ్) డాక్టర్ జి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి), గాంధీ హాస్పిటల్‌లోని టెస్టింగ్ ల్యాబొరేటరీ మంగళవారం సాయంత్రం మంకీపాక్స్ పరీక్షల నెగిటివ్ నిర్ధారణ ఫలితాలను విడుదల చేశాయి.
రోగి ఫీవర్ హాస్పిటల్‌లో చేరిన తర్వాత వైద్యులు అతని నుండి రక్త నమూనాలు, లెసియన్ ఫ్లూయిడ్, గాయాల క్రస్ట్‌లు, మూత్ర నమూనాలను సేకరించి నిర్ధారణ కోసం పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV), గాంధీ హాస్పిటల్ కి పంపారు. తాజాగా ఆ వ్యక్తికి నెగిటివ్‌గా రావడంతో ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క మంకీ ఫాక్స్ కేసు కూడా నమోదు కాలేదని ప్రజారోగ్య శాఖ సీనియర్ అధికారులు స్పష్టం చేశారు.