Telangana: 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్.. చివరకు..
సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్‌స్టేషన్‌లో పని చేసే కానిస్టేబుల్ బానోతు కృష్ణంరాజు (40) నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు.
By అంజి
Telangana: 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్.. చివరకు..
సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్‌స్టేషన్‌లో పని చేసే కానిస్టేబుల్ బానోతు కృష్ణంరాజు (40) నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు. ముగ్గురికి విడాకులు ఇచ్చి రాజు రెండేళ్ల క్రితం 13 ఏళ్ల బాలికను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. అతని అసలు రూపం తెలియడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
సూర్యాపేట రూరల్ ఎస్సై బాలునాయక్ కేసు వివరాలు తెలిపారు. సూర్యాపేట మండలం సపావత్‌తండాకు చెందిన ఓ బాలికను చివ్వెంల మండలం తుల్జారావుపేటకు చెందిన బానోతు కృష్ణంరాజు 2023 డిసెంబరులో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో బాలిక వయస్సు 13 ఏళ్లు. దీని కంటే ముందు కృష్ణంరాజుకు 3 పెళ్లిళ్లు జరిగాయి. ఆ ముగ్గురితోనూ విడాకులయ్యాయి. కృష్ణంరాజుకు సంబంధించిన ఈ విషయాలను బాలిక తల్లిదండ్రులు ఆలస్యంగా తెలుసుకున్నారు.
గతంలో జరిగిన మూడు పెళ్లిళ్ల సంగతి చెప్పకుండా కృష్ణంరాజు తమ కూతురిని పెళ్లి చేసుకుని మోసం చేశాడని బాలిక తల్లిదండ్రులు 10 రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన అధికారులు 2012 బ్యాచ్‌కు చెందిన కృష్ణంరాజును విధుల నుంచి సస్పెండ్ చేశారు. బాలల సంక్షేమ అధికారులు జోక్యం చేసుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కృష్ణంరాజుపై చైల్డ్, మ్యారేజ్ ప్రొవిజన్ చట్టం కింద అత్యాచారం, పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కృష్ణంరాజు కోసం గాలింపు జరుగుతోంది.