కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
By Knakam Karthik
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే ఈ భూముల వేలంపై వర్సిటీ విద్యార్థులతో పాటు వట ఫౌండేషన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు కంచ గచ్చిబౌలి భూములపై సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములు సందర్శించి మధ్యాహ్నం 3.30 గంటలకు నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా ఆ 400 ఎకరాల భూమి 30 సంవత్సరాలుగా వివాదంలో ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఇప్పటికే ఈ భూముల వేలంపై విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయంపై పలువురు తెలంగాణ హైకోర్టు తో పాటు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై వాటా ఫౌండేషన్ కోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ భూమిలో ప్రభుత్వ వేలాన్ని నిలిపివేయాలని, వన్యప్రాణులకు ఆవాసమైన ఆ స్థలాన్ని జాతీయ పార్కు గా ప్రకటించాలని ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. ఈ పిల్ పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి.. ఈ రోజు వరకు చెట్ల నరికివేతలు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది.