ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు

సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల నిర్వహించిన సమావేశాలలో ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సిఫార్సు చేసింది

By Medi Samrat
Published on : 21 April 2025 8:45 PM IST

ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు

సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల నిర్వహించిన సమావేశాలలో ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సిఫార్సు చేసింది - ఇద్దరు తెలంగాణ నుండి, నలుగురు కర్ణాటక నుండి, ఒకరు ఆంధ్రప్రదేశ్ నుండి బదిలీ అవ్వనున్నారు. హైకోర్టుల స్థాయిలో సమగ్రత, వైవిధ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు కొలీజియం అభిప్రాయపడింది.

ఎస్సీ కొలీజియం ఈ క్రింది బదిలీలను సిఫార్సు చేసింది:

1. జస్టిస్ పెరుగు శ్రీ సుధ తెలంగాణ హైకోర్టు నుండి కర్ణాటక హైకోర్టుకు

2. జస్టిస్ కసోజు సురేంద్ర అలియాస్ కె సురేందర్ తెలంగాణ హైకోర్టు నుండి మద్రాస్ హైకోర్టుకు

3. జస్టిస్ హేమన్ చందనగౌడర్ కర్ణాటక హైకోర్టు నుండి మద్రాస్ హైకోర్టుకు

4. జస్టిస్ కృష్ణన్ నటరాజన్ కర్ణాటక హైకోర్టు నుండి కేరళ హైకోర్టుకు

5. జస్టిస్ నేరనహళ్లి శ్రీనివాసన్ సంజయ్ గౌడ కర్ణాటక హైకోర్టు నుండి గుజరాత్ హైకోర్టుకు

6. జస్టిస్ దీక్షిత్ కృష్ణ శ్రీపాద్ కర్ణాటక హైకోర్టు నుండి ఒరిస్సా హైకోర్టుకు

7. జస్టిస్ డాక్టర్ కుంభజదల మన్మధరావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి కర్ణాటక హైకోర్టుకు

కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ హేమంత్ చందనగౌడర్, జస్టిస్ సంజయ్ గౌడ, జస్టిస్ కె.నటరాజన్ లను బదిలీ చేయాలని సిఫార్సు చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.శ్రీసుధ, జస్టిస్ కె.సురేందర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావులను బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఏప్రిల్ 15, 19 తేదీల్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనను సోమవారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ కొలీజియంలో సీజేఐతో పాటు ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.

Next Story