ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు ఎల్లుండి నుంచి (ఏప్రిల్ 24వ తేదీ) నుంచి సమ్మర్ హాలిడేస్ మొదలు కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. డిప్యుటేషన్లపై పని చేస్తున్న టీచర్లు ఇవాళ రిలీవై రేపు పాత స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. మరోవైపు తెలంగాణలోనూ ఎల్లుండి నుండే సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, కార్పొరేట్, గురుకుల స్కూళ్లకు సెలవులు ఉంటాయి. ప్రస్తుతం వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ఒంటిపూట బడులు నడుస్తున్నాయి.
ఇక పాఠశాలలు జూన్ 12, 2025న తిరిగి తెరుచుకుంటాయని తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. దీంతో పాఠశాల విద్యార్థులకు 46 రోజుల వేసవి సెలవులు లభిస్తాయి. అటు హాలిడేస్‌లో పిల్లలకు తరగతులు నిర్వహించరాదని అధికారులు ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు స్పష్టం చేశారు. ఈ సెలవులు విద్యార్థులకు వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించడమే కాక, వారు సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొనడానికి, కుటుంబ సమయాన్ని గడపడానికి అవకాశం కల్పిస్తాయి.