తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నేటితో స్కూళ్లకు వేసవి సెలవులు ముగిశాయి. కాగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం వేసవి సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని స్కూళ్లు, డైట్ కాలేజీలకు జూన్ 20వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు వెలువరించారు.
ఇదిలావుంటే.. మరో వారం రోజుల్లో ఇంటర్ ఫలితాలు ప్రకటిస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. కరోనా కారణంగా ఇప్పటికే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను రద్దు చేసింది. పస్ట్ ఇయర్ విద్యార్థులను రెండో సంవత్సరంలోకి ప్రమోట్ చేసింది. అలాగే ఇంటర్మీడియేట్ కాలేజీల్లో తరగతుల నిర్వహణ తేదీలను కూడా ప్రకటించింది. జూలై 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు, జూలై 15 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామని కార్యదర్శి ఉమర్ జలీల్ పేర్కొన్నారు.