తెలంగాణ స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
Summer Holidays Extended For Telangana Schools. తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో
By Medi Samrat Published on
31 May 2021 2:04 PM GMT

తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేసవి సెలవులను కూడా పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు జూన్ 15వ తేదీ వరకు వేసవి సెలవులు పొడిగిస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. స్కూళ్లతో పాటు డైట్ కాలేజీలకు కూడా 15 వరకు సెలవులు పొడిగించారు. అంతకుముందు తెలంగాణలోని విద్యాసంస్థలకు ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం లాక్‌డౌన్ పొడిగింపుతో మరోమారు వేసవి సెలవులను పొడిగించింది విద్యాశాఖ.
Next Story