తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు వేసవి సెలవులను అధికారికంగా ప్రకటించింది. 2026 ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు మొత్తం 48 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని విద్యాశాఖ వెల్లడించింది. అకడమిక్ సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయడానికి వీలుగా పాఠశాలలు అవసరమైతే అదనపు తరగతులు నిర్వహించుకోవచ్చని అధికారులు సూచించారు.
ఇప్పటికే ఎండ తీవ్రత దృష్ట్యా ఫిబ్రవరి నుంచే ఒంటిపూట బడులు (ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు) కొనసాగుతుండగా, ఈ సుదీర్ఘ వేసవి సెలవులు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి. దీనితో 2026-27 విద్యా సంవత్సరం జూన్ రెండో వారం నుండి ప్రారంభం కానుంది.