అమెరికన్ కార్నర్ హైదరాబాద్ సహకారంతో మహిళల కోసం సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో నిర్వహించిన జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI Bootcamp లో.. సీనియర్ జర్నలిస్ట్, ఇన్వెస్టిగేటివ్ ఎడిటర్ "సుధాకర్ రెడ్డి ఉడుముల" విద్యార్థులను ఉద్దేశించి ఒక శక్తివంతమైన సందేశాన్ని అందించారు.
ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ అనేది సరైన సమాచారం ఇస్తుందని చెప్పలేం.. తప్పుడు వార్తలను సృష్టించడానికి, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి జెనరేటివ్ AI ని ఉపయోగించవచ్చు.. ఇది ప్రపంచానికి జ్ఞానోదయం కలిగించవచ్చు లేదా అణుశక్తి వంటి విధ్వంసానికి కూడా దారితీయవచ్చని సుధాకర్ రెడ్డి ఉడుముల అన్నారు. రాను రాను డిజిటల్ టూల్స్ పై అధికంగా ఆధారపడటం వల్ల.. మనిషి మానసిక మేథో శక్తి పూర్తిగా క్షీణించిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..
వేగంగా మారుతున్న జనరేటివ్ ఏఐ రంగం..
జర్నలిజం, విద్య, హెల్త్ కేర్ వంటి రంగాల మీద జనరేటివ్ ఏఐ ప్రభావం ఏవిధంగా ఉండబోతోందో.. జనవరి 6,7 వ తేదీల్లో జరిగిన వర్క్ షాప్ లో సుధాకర్ రెడ్డి ఉడుముల సమూలంగా వివరించారు. ఈ Bootcamp లో యశోద హాస్పిటల్స్ కి చెందిన ప్రముఖ సర్జికల్ ఆంకాలజీ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ చినబాబు సుంకవల్లి కూడా పాల్గొన్నారు. ఆయన డేటా ఆధారిత డయాగ్నొస్టిక్స్, సర్జరీ లలో ఏఐ విశిష్టతను వివరించారు.
సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల ప్రిన్సిపాల్, డాక్టర్ ఉమా జోసెఫ్, అమెరికన్ స్పేస్ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ ఎంఎస్ మెలిస్సా ఈ ఈవెంట్‌ను ప్రారంభించి.. అత్యాధునిక నైపుణ్యాలతో శ్రామిక శక్తిని సన్నద్ధం చేయడంలో AI పరివర్తన సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు.
కంటెంట్ క్రియేషన్, కోడ్ జనరేషన్, నో కోడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ వంటి వాటిపై కూడా ఈ వర్క్ షాప్‌లో చర్చించడం జరిగింది.
Generative AI Bootcampలో మానవ పర్యవేక్షణ, జవాబుదారీతనం నిర్వహించడం వంటి అంశాలను సుధాకర్ రెడ్డి ఉడుముల స్థూలంగా వివరించారు. ఈ బూట్ క్యాంప్.. నూతన ఆవిష్కరణలు, సామాజిక శ్రేయస్సు కోసం ఒక శక్తిగా పనిచేస్తుందని పేర్కొన్నారు.