ఎలుక మూతి ఆకారం పోలి ఉన్న అరుదైన చేప.. ఎక్కడంటే?
Suckermouth catfish. సాధారణంగా చేపల గురించి అవగాహన ఉన్నవారు కొన్ని రకాల చేపల గురించి
By Medi Samrat Published on 23 Jan 2021 9:34 AM GMTసాధారణంగా చేపల గురించి అవగాహన ఉన్నవారు కొన్ని రకాల చేపల గురించి మాత్రమే తెలుసుకొని ఉంటారు. అయితే చేపలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కో రకం చేప ఒక్కో ధర పలకడం మనం చూస్తుంటాము. కానీ సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు కొన్ని అరుదైన చేపలు దొరుకుతుంటాయి. అలాంటి చేపలకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి ఎంతో ఖరీదైన అరుదైన చేపలు గురించి ఎన్నో విన్నాము. కానీ అలాంటి అరుదైన జాతికి చెందిన ఒక చేప అచ్చం ఎలక మూతి ఆకారాన్ని పోలి ఉండటంతో స్థానికులు ఈ చేపను చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇంతకీ ఆ చేప ఎక్కడ కనిపించిందంటే....
ఈ చేప శరీరంపై జిబ్రా మాదిరి గీతలను కలిగి ఉండి... ఎలుక మూతి ఆకారంలో చూడటానికి ఎంతో భయంకరంగా ఉంది. ఇంతటి భయంకరంగా ఉన్న ఈ అరుదైన చేప పేరు సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అని పిలుస్తారు. సాధారణంగా ఇలాంటి అరుదైన చేపలు ఇతర దేశాలలో మాత్రమే కనిపిస్తాయి. కానీ కొద్ది రోజుల క్రితమే ఇలాంటి అరుదైన చేపను మన భారతదేశంలోని నదులలో దీనిని గుర్తించారు.
ఈ అరుదైన చేప తాజాగా మన దేశంలో నదుల ద్వారా గోదావరికి చేరింది.సిరిసిల్లకు చెందిన మత్స్యకారుడు వంగళ నరేశ్ కు సిరిసిల్లలోని ఎస్సారార్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌లో ఈ అరుదైన చేప దొరికింది.అయితే వింత ఆకారంలో ఉన్న ఈ అరుదైన చేపను చూడటానికి పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇలాంటి చేపలు మన దేశంలో కనిపించడం చాలా అరుదు అని. ఈ చేపను సిరిసిల్ల ప్రాంతంలో గుర్తించడం ఇదే మొదటిసారని స్థానికులు తెలియజేశారు.