రవాణా శాఖ మీద డ్రైవ్ చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గాంధీ భవన్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, IAS, IPS ల డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్ట్ పెడతామని పేర్కొన్నారు. అనుభవం లేని డ్రైవర్లతో ఈ మధ్య కాలంలో వీఐపీలు రోడ్డు ప్రమాదం లో చనిపోతున్నారని అన్నారు. వీఐపీలు అందరికీ లెటర్లు పంపిస్తామన్నారు. సుదూర ప్రాంతాలకు కేవలం సెలెక్టెడ్ డ్రైవర్లను నియమించుకోవాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలోఆర్టీసీకి ఆరు వేల కోట్లు అప్పులు ఉన్నవి. మహాలక్ష్మి ద్వారా మహిళలు పెద్ద ఎత్తున బస్‌లలో ప్రయాణం చేస్తున్నారని అన్నారు. మహిళలు రాష్ట్రంలో అన్ని దేవాలయాలకు వెళ్తున్నారు.. దీనితో ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందన్నారు. మహాలక్ష్మి మొదలైన తర్వాత రోజు 50 లక్షల మంది బస్ లలో ప్రయాణం చేస్తున్నారని.. ఇప్పుడిప్పుడే RTC లాభాల బాట పడుతుందన్నారు.
కొత్త బస్ లను కొనుగోలు చేశాం.. మేడారం జాతరలో రవాణా శాఖ కట్టు దిట్టంగా వ్యవహరించిందన్నారు. ఆటో డ్రైవర్లకు 12వేలు ఇస్తామని హామీ ఇచ్చాము అమలు చేస్తామన్నారు. 2023 అక్టోబర్ లో GHMCలో 450, రూరల్ లో 3030 ఆటోలు కొన్నారని వెల్లడించారు.