ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.
By - Knakam Karthik |
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. చిన్న ప్లాట్లలో ఇందిరమ్మ ఇళ్లను జీ+1 పద్ధతిలోనూ నిర్మాణం చేసుకునేందుకు అనుమతించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో స్థలం ఉన్న వారికి ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేస్తోంది. ఇల్లు కనీసం 400 చదరపు అడుగులు, గరిష్ఠంగా 600 చదరపు అడుగులు ఉండాలని షరతు విధించింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో 400 చదరపు అడుగుల నిర్మాణం చేపట్టలేని ప్లాట్లలో జీ ప్లస్ వన్ పద్ధతిలో కట్టుకునేందుకు సర్కారు సడలింపు ఇస్తూ పూర్తి వివరా లతో మార్గదర్శకాలు (జీవో 69) విడుదల చేసింది.
ఈ మేరకు జీ+1 ఇళ్లకు కనీస కార్పెట్ ఏరియా 323 చదరపు అడుగులు ఉండాలని స్పష్టం చేసింది. కిచెన్, బాత్రూం, టాయిలెట్ కచ్చితంగా ఉండాలని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో రూఫ్ నిర్మించాక రూ.లక్ష, మొదటి అంతస్తు రూఫ్ లెవెల్ వరకు కాలమ్స్ నిర్మించాక మరో రూ.లక్ష, గోడలు నిర్మించిన అనంతరం రూ.2 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక రూ. లక్ష నగదును విడుదల చేస్తారు.
కొత్త నిబంధనలు ఇవే..
గ్రౌండ్ ఫ్లోర్‌లో 200 అడుగులు ఉండాలి
ఫస్ట్ ఫ్లోర్‌లో 200 అడుగులు ఉండాలి
ఒక్కో ఫ్లోర్‌లో రెండు గదులు 70 చదరపు అడుగుల చొప్పున ఉండాలి
కిచెన్ 35.5 చదరపు అడుగులు
టాయిలెట్, బాత్రూం కచ్చితంగా ఉండాలి
రూ. 5 లక్షలను నాలుగు దశల్లో అందజేస్తారు.