ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఫేజ్ -2కు 'రాంరెడ్డి దామోదర్ రెడ్డి' పేరు : సీఎం రేవంత్ ప్రకటన

నమ్మిన కార్యకర్తల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులను అమ్ముకున్న నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By -  Medi Samrat
Published on : 12 Oct 2025 5:31 PM IST

ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఫేజ్ -2కు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు : సీఎం రేవంత్ ప్రకటన

నమ్మిన కార్యకర్తల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులను అమ్ముకున్న నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి దశ దిన కర్మలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. ఆయ‌న‌ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్న నేత.. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు గోదావరి నీటి కోసం పోరాడిన నేత.. సాగు, తాగు నీటికోసం 40 ఏళ్ల క్రితమే పోరాడిన నేత.. SRSP ఫేజ్ - 2 కోసం రాంరెడ్డి దామోదర్ రెడ్డి నిరంతరం పోరాటం చేశారని కొనియాడారు.

సూర్యాపేట కు వెళ్ళినా.. ఆయన తుంగతుర్తిని ఏనాడు మరవలేదు.. మందుల సామేల్ విజయం వెనక రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఉన్నారు. గాంధీ కుటుంబం దామోదర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. AICC ఆదేశాల ప్రకారం ఏ అవకాశాలు వచ్చినా దామోదర్ రెడ్డి కుటుంబానికి దక్కుతాయన్నారు. SRSP ఫేజ్ -2 కు RDR SRSPగా నామకరణం చేస్తున్నాం.. 24 గంటల్లో GO ఇస్తామ‌న్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్..

రాంరెడ్డి దామోదర్ రెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేరు.. 40 ఏళ్లుగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన నేత.. SRSP సాగు నీటి కోసం ఆయన కృషి చిరస్మణీయం అన్నారు.. SRSP ఫేజ్ -2 కు.. RDR SRSP గా నామకరణం చేయాలని సీఎం ను కోరారు. దామోదర్ రెడ్డి కోరిక మేరకు SRSP నుండి సాగు నీటినీ సూర్యాపేట, తుంగతుర్తి కి అందిస్తామ‌న్నారు. రాంరెడ్డి స్పూర్తితో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు అందరం కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తామ‌ని.. దామోదర్ రెడ్డి కొడుకుకు అండగా ఉంటామని పేర్కొన్నారు.

Next Story